రామగుండం పోలీస్ కమీషనరేట్
బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
క్రమశిక్షణ తో ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవం పెంచే విధంగా నిజాయితీగా పనిచేయాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,
పోలీసుల గౌరవ మర్యాదలు పెంపోందించే విధంగా క్రమశిక్షణ తో నిజాయితీగా పోలీస్ అధికారులు పనిచేయాలని , పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల పిర్యాదు లపై తక్షణమే స్పందించాలని పోలీస్ అధికారులు రామగుండం పోలీస్ కమిషనర్ సూచించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు గోదావరిఖని వన్ టౌబ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు స్టేషన్ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా సీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనీతీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లు వివరాలు, వారు పై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితులు, వారి కదలికల గురించి, అనుమానితులు, కేడీ, డిసిల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిస్సింగ్, ఇతర నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కలిగించడంతో పాటు, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో, నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతోపాటు, మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సీపీ తెలిపారు.
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది యొక్క పనితీరుని సిపి అభినందించారు.
ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ, డీసీపీ చేతుల మీదుగా మొక్కలను నాటారు.
ఈ తనిఖీల్లో పెద్దపల్లి డిసిపి కరుణాకర్, గోదావరిఖని ఏసీపీఎం రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్, ఎస్సైలు భూమేష్, రమేష్ లు పాల్గోన్నారు.
