భీమారంలో ఘనంగా కట్ట మైసమ్మ తల్లి కొలుపు,
మంచిర్యాల జిల్లా జూన్ 21, 2026: భీమారం మండల కేంద్రంలోని ఇప్పల బొగుడ వద్ద గత సంవత్సరం గుడి నిర్మించి ప్రతిష్టించిన కట్ట మైసమ్మ తల్లి దేవాలయం వద్ద కట్ట మైసమ్మ తల్లి కొలుపు కార్యక్రమాన్ని కట్ట నాగరాజు-కోమలి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు, మైసమ్మ తల్లి కి శనివారం రోజున సాయంత్రం నుండి ఆదివారం వరకు పంబాల కళాకారులచే పూజా కార్యక్రమాలు నిర్వహించి, బోనాలు చెల్లించి, కోళ్లు మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , పెనుకుల మల్లేష్, పెనుకుల భీమేష్, అన్నపురం కృష్ణమూర్తి గౌడ్, మాటేటి సమ్మయ్య, బైరినేని మహేష్, భూక్య రమేష్, భీమారం సర్పంచ్ ఉష్క మల్ల విజయలక్ష్మి -పున్నం చంద్, భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోడేటి రవి, సీనియర్ నాయకులు దర్శనాల రమేష్, గుండు తిరుపతి, వేల్పుల శ్రీనివాస్, చిలకాని రాజమణి, మద్దికల్ సర్పంచ్ పోతం సమ్మన్న, భూక్య గోపి, జర్పుల దస్రు నాయక్ పాల్గొన్నారు.





