తెనుగుగూడెం లో నూతన పోచమ్మ తల్లి, పెద్దమ్మతల్లి దేవాలయాలు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, లంబడి తండ గ్రామపంచాయతీ లోని తెనుగుగూడెంలో నూతన పోచమ్మ తల్లి ఆలయం, నూతన పెద్దమ్మ తల్లి ఆలయం గ్రామ ప్రజల సహకారంతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. పోచమ్మ తల్లి ఆలయ భూదాత గుర్రాల శంకర్ అని, అలాగే పోచమ్మతల్లి ఆలయ నిర్మాణం, విగ్రహ దాత సాగర్ల అంజయ్య అని తెలిపారు. అలాగే పెద్దమ్మ తల్లి ఆలయ భూమి దాత సాగర్ల నర్సమ్మ లక్ష్మయ్య, విగ్రహ దాత సాగర్ల రవి, పంచ పాండవుల విగ్రహ దాత సిద్ధి అర్జున్, పోతరాజు విగ్రహ దాత బొగ్గుల మహేష్ అని తెలిపారు. గురువారం బోనాల జాతర ఉంటుందని భక్తులు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సాగర్ల లక్ష్మయ్య, సాగర్ల రవి, సాగర్ల అంజయ్య, గుర్రాల శంకర్, సిద్ది అర్జున్, బొగ్గుల మహేష్, సాగర్ల స్వామి, మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.





