నేరాలు

తండాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు

248 Views

తండాల్లో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ పోలీసులు

ముగ్గురు నిందితుల పై కేసు నమోదు

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని గుండారం,రాజన్నపేట, కిష్టు నాయక్ తండాల్లో శనివారం జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు డీటీఎఫ్ ఎస్సై శైలజ, సిరిసిల్ల ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను గుర్తించి వారి వద్ద నుండి 12 లీటర్ల పానకం,20 కిలోల బెల్లం,3 కిలోల పటిక,ఒక హోండా ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు.200 లీటర్ల వాష్ ను ధ్వంసం చేసి ముగ్గురు నిందితుల పై కేసు నమోదు చేసినట్లుగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలిపినారు. నాటు సారాయి తయారీకి సంబంధించి ఎలాంటి ముడి సరకు కలిగి ఉన్నా,రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *