నేరాలు

ఇందారంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్

252 Views

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

మంచిర్యాల జిల్లా:డిసెంబర్ 02
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామ సమీపంలోని మాజీ మావోయిస్టు ఇంటిలో తలదాచుకున్న ఇద్దరు మావోయిస్టులను పోలీస్ అధికారులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

గత ఆరునెలల నుంచి మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానించాయి.

శనివారం ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంటిలో వారు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు ఆ ఇంటిని చుట్టిముట్టారు. వారి వద్ద ఆత్మ రక్షణ కోసం ఉంచుకున్నఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న ఇద్దరు మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ క్రమంలోనే వైద్య చికిత్స కోసం వచ్చినట్టు తెలిసింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *