(తిమ్మాపూర్ అక్టోబర్ 26)
తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ చౌరస్తాలో ఎల్ఎండీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి యువకుడి వద్ద గంజాయిని పట్టుకున్నారు. ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ లకు నమ్మదగిన సమాచారం మేరకు అల్గునూర్ చౌరస్తా లో స్కూటీ పై ప్రయాణిస్తూన్న వ్యక్తిని
టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎల్ఎండీ పోలీసులు తనిఖీలు చేశారు. స్కూటీలో 1 కిలో 265 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన యువకుడు అలుగునూర్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన బట్టు అఖిల్ (25) గా గుర్తించారు. అఖిల్ గత కొన్ని నెలలుగా అల్గునూర్, ఎల్ఎండీ కాలనీ, తిమ్మాపూర్ తోపాటు చుట్టు పక్కన గ్రామాల్లో స్కూటీపై తిరుగుతూ గంజాయి విక్రయం చేస్తున్నాడు. ఆంధ్రలోని సీలేరు ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేస్తూ అధిక ధరకు యువతకు విక్రయిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం పక్కా సమాచారం మేరకు అఖిల్ స్కూటీని తనికీ చేయగా 1 కిలో 265 గ్రాముల గంజాయి లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని పంచుల సమక్షంలో ఎస్సై పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.
తిమ్మాపూర్ సీఐ ఇంద్రసేనా రెడ్డి స్కూటీ, గంజాయి తో పాటు అఖిల్ ని అరెస్ట్ చేసి కోర్టు కు తరలించారు.ఈ దాడుల్లో ఎల్ఎండి ఎస్సై ప్రమోద్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ ఎస్సై సాంబమూర్తి, ఎల్ఎండీ పోలీసులు ఉపేందర్, మల్లికార్జున్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.