ప్రాంతీయం

మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి

29 Views

మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి – బాద నరేష్ డిమాండ్

TS తెలుగు న్యూస్ 24/7: ముస్తాబాద్ మండలం  చికోడు గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మహాలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో నేడు చికోడు గ్రామంలో ఐదో వార్డ్ మెంబర్ బాద నరేష్ ఆధ్వర్యంలో గ్రామ మహిళల సమక్షంలో గౌరవ గ్రామ పంచాయతీ కార్యదర్శికి మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బాద నరేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన మహిళలందరికీ నెలకు ₹2,500 చొప్పున మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మహిళల సంక్షేమం కోసం ప్రకటించిన ఈ పథకాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో లక్ష్మీ సరిత, రాజవ్వ, ఎల్లవ్వ, కనకవ్వ, కొప్పు లక్ష్మి, లత, భూమవ్వ, బైటి లక్ష్మి, గొట్టిగల్లు ఎల్లవ్వ, దేవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *