Breaking News

ఎల్లారెడ్డిపేటలో పోలీసు జాగిలంతో డ్రగ్స్ వేట

152 Views

డ్రగ్స్,గంజాయి నిర్మూలనకు పోలీసుల  ప్రత్యేక తనిఖీలు.

ఎల్లారెడ్డిపేట మండలంలో కిరాణా,పాన్ షాప్స్,బస్టాండ్ ప్రాంతాలలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీలు నిర్వహణ.

మత్తు పదార్థాల విక్రయాలు,రవాణాపై కఠిన చర్యలు తప్పవు: ఎస్సై రాహుల్ రెడ్డి.

ఎల్లారెడ్డిపేట మండలంలోని కిరాణా,పాన్ షాప్స్, బస్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పోలీసు అధికారులు నార్కోటిక్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని,గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన,భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *