
పనిచేయని ఏటీఎం లు ప్రజలకు తప్పని తిప్పలు
-సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఏటీఎం వద్ద పడిగాపులు కాసిన ప్రజలు
TS తెలుగు 24 /7న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో పాటు గొల్లపల్లి గ్రామంలో గల ఎటిఎం మిషన్ లు తరచూ మొరాయిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శనివారం రోజున మండల కేంద్రంలో గల ఐఓబి బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు లేకపోవడం,ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లిలో గల ఎస్బీఐ ఏటీఎం లు పనిచేయక పోవడం,ఎల్లారెడ్డిపేట సహకార బ్యాంక్ ఏటీఎం షటర్ సమయానికి తెరవక పోవడం,ఇక గొల్లపల్లి ఆంధ్రాబ్యాంక్ ఏటీఎం అయితే తరచూ పనిచేయడం లేదని వినియోగదారులు మండి పడుతున్నారు.అన్ని ఏటీఎం లు తిరిగిన ప్రజలకు ఒక్క సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఏటీఎం కాస్త ఊరటనిచ్చిందని చెప్పొచ్చు.ఆ ఒక్క ఏటీఎం పనిచేయడంతో ఆసుపత్రి అవసరాల కోసం రోగుల బంధువులు,వడ్ల డబ్బుల కోసం రైతులు,అప్లికేషన్ల ఫీజుల కోసం విద్యార్థులు,వివిధ అవసరాల నిమిత్తం మరికొందరు ఆ ఏటీఎం వద్ద బారులు తీరి ఇబ్బందులు పడ్డారు.బ్యాంక్ ఖాతాకు,ఏటీఎం, వినియోగానికి ఛార్జీలు వసూలు చేసే బ్యాంకులు వినియిదారులకు సేవలు అందించడంలో విఫలమవుతున్నారు అని పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు పని వేళలోనే పరిస్థితి ఇలా ఉంటే బ్యాంకు సమయం అయిపోయిన తర్వాత గాని బ్యాంకు హాలిడే రోజు గాని వినియోగదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారు గ్రహించి ఇప్పటికైనా మండలంలో గల వివిధ బ్యాంక్ ల ఏటీఎం లలో ప్రజలకు ఎనీ టైం మనీ ని అందించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.





