ప్రాంతీయం

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

4 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

పోలీసు శాఖలో అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిశోర్ ఝా సూచించారు.ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఆర్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన సలీమ్, కొమురన్నలు పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను పోలీస్ కమిషనర్ అలంకరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పదోన్నతి అనేది మరింత బాధ్యతతో కూడుకున్న అవకాశమని పేర్కొన్నారు.విధుల్లో ఎల్లప్పుడూ నిజాయితీ,క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని సూచించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉన్నతాధికారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా విధులు నిర్వహించాలని తెలిపారు.పదోన్నతి పొందిన అధికారులు తమ బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *