
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొప్పాపూర్ గ్రామంలో మార్పుకు శ్రీకారం చుట్టారు.
మార్పు విజయలక్ష్మి జ్ఞాపకార్థం తన కుమారులు 2500 స్టీల్ ప్లేట్లు,2500 గ్లాసులు గ్రామ పంచాయతీకి అందజేశారు.
ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి,నీరు,గాలి,ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహణ
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి-శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి, పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి,గ్రామస్తుల సమక్షంలో అవగాహన సదస్సును నిర్వహించి గ్రామస్తులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు.గ్రామ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి – శ్రీనివాస్ రెడ్డి,ఉప సర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ… ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు.ఫంక్షన్ హాలులలో,వర్తక వ్యాపార దుకాణాలలో ప్లాస్టిక్ ప్లేట్లు,ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని,ప్లాస్టిక్ భూమిలో కుళ్లిపోవడానికి 400-1000 సంవత్సరాలు పడుతుందని,ప్లాస్టిక్ భూమిలో కలిస్తే మట్టి సారం తగ్గి మొక్కలు సరిగా పెరగవనీ,ప్లాస్టిక్ చెరువుల్లో, కుంటల్లో చేరడం వల్ల ఎన్నో జీవరాశులు చనిపోతాయని,ప్లాస్టిక్‌ను కాలిస్తే విష వాయువులు వెలువడి క్యాన్సర్‌కు కారణం అవుతాయనీ తెలిపారు.గ్రామ ప్రజలు చెత్త బండి వచ్చినప్పుడు తడి చెత్త,పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరణ ట్రాక్టర్ కు ఇచ్చి ప్రజలు సహకరించాలని,ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క నాటాలని,నీటిని వృధా చేయకూడదని తెలిపారు.ఇటీవల మాజీ సర్పంచ్ మార్పు విజయలక్ష్మి మరణించడంతో తన కుమారులు శ్రీకాంత్,ప్రశాంత్ లు తన తల్లి జ్ఞాపకార్థం 2500 స్టీల్ ప్లేట్లు,2500 స్టీల్ గ్లాస్ లు గ్రామ పంచాయతీకి వితరణ చేశారు,ఇట్టి ప్లేట్లు గ్లాసులను,గ్రామస్తులు వారి ఇండ్లలో శుభకార్య,అశుభకార్యాల్లో అట్టి ప్లేట్లను,గ్లాసులను వాడుకొని మరలా తిరిగి గ్రామపంచాయతీకి అప్పజెప్పి,పాలకవర్గానికి సహకరించాలని ప్లాస్టిక్ ప్లేట్లను వాడకూడదని తెలిపి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మార్పు వారి సహకారంతో గ్రామంలో మార్పుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,ఆశ వర్కర్లు, ప్రజా ప్రతినిధులు,నాయకులు,అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.





