గజ్వేల్ లో వందేమాతరం గీతాలాపన విజయవంతం
సిద్దిపేట జిల్లా, నవంబర్ 7
వందేమాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద ఘనంగా వందేమాతరం గీతాలాపన నిర్వహించారు, ఈ సందర్భంగా సామాజిక సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ పలువురు నేతలు మాట్లాడుతూ భారత దేశం విదేశీ కబంధ హస్తాల నుండి విముక్తి కోసం దేశ ప్రజలను జాగృతం చేసే విధంగా దాదాపు 150 సంవత్సరాల క్రితం బంకిన్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం దేశ ప్రజలలో దేశభక్తిని పెంపొందించిందని నాటిస్ఫూర్తిని కొనసాగింపుగా వందేమాతరం గీతాలాపన నిర్వహించడం జరిగిందని, జాతీయ గీతం స్ఫూర్తిగా సమైక్యత భావంతో దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, యువత విద్యార్థులు వందేమాతరం స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రముఖులు,వ్యాపారస్తులు,హైందవ సోదరులు,వివిధ పార్టీల నాయకులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు , విద్యార్థిని,విద్యార్థులు, పాల్గొన్నారు





