ముస్తాబాద్, డిసెంబర్ 29 (24/7 న్యూస్ ప్రతినిధి) ఓటు అంటే మామూలు అయినది కాదు గ్రామ అభివృద్ధి కోసం నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తుల కోసం ఆలోచించాలి. పట్నం బాబులను నమ్ముతున్నారా… సభలు సమావేశాలు నిర్వహించినవి కావు ఆర్థికంగా బలంగా ఉన్నవారి భయంతో ఓట్లు వేయడంకాదు ప్రతినిత్యం ప్రజల్లో మమేకమై ఏ సమస్య వచ్చిన బలంగా నిలబడే ఉత్తములను ఎంచుకొని సమస్య ఏదైనా మేము ఉన్నామని భరోసానిచ్చి రాత్రింబవళ్లు గ్రామాలకు సేవ చేసేవాళ్ళను గ్రహించి మంచి చెడు ఎనక ముందు ఆలోచించి తమ
తమ అమూల్యమైన ఓట్లను వినియోగించుకోవాలని పలువురు కోరుతున్నారు. బలమున్నోనికి బల్చినోనికి ఓట్లు వేస్తే ఐదేళ్లపాటు వారికి బానిసలుగా బతకద్దని స్థానికులు కోరుతున్నారు. ఇక మండలంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే మండల పరిధిలోని పలు గ్రామాల్లో సర్పంచ్ పదవికోసం పలుపార్టీలు గుట్టుచప్పుడు కాకుండా సమావేశం నిర్వహించి ఏకగ్రీవం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం..




