ప్రాంతీయం

దీక్ష భగ్నం చేసినా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాం..

109 Views

దీక్ష భగ్నం చేసినా డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తూనే ఉంటాం..

– బోయిని సదన్ మహారాజ్, DSP జిల్లా అధ్యక్షులు.

సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 19

సిద్దిపేట జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన తర్వాత పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో DSP జిల్లా అధ్యక్షులు సదన్ మహారాజ్ గారు మాట్లాడుతూ ప్రజలందరికీ ఉచిత నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య, ఉచిత నాణ్యమైన వైద్యం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి, కుటుంబానికి సాగు యోగ్యం కలిగిన ఒక ఎకరం భూమి, కుటుంబానికి నాలుగు గదుల ఇల్లు అనే ఐదు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ను ప్రభుత్వం అర్దరాత్రి పూట భగ్నం చేయడాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు. దీక్షను భగ్నం చేసినా కూడా ధర్మ సమాజ్ పార్టీ ఈ అయిదు డిమాండ్లు సాధించే వరకు అనేక రూపాలలో పోరాటం చేస్తూనే ఉంటుంది అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి. బి. రాజు, జిల్లా నాయకులు చెంచల ఎల్లన్న, కట్ల అంజిబాబు, వొద్దిరాల సతీష్ లు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found