మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదినం పురస్కరించుకొని ఆయన తన నివాసంలో సతీమణి తార తో కలిసి తన మాతృ మూర్తి మల్లమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కెమికల్ ఏరియాలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆంజనేయస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే సోమగూడెం కల్వరి చర్చ్ కు వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు శ్రేయోభిలాషులు, మైనారిటీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,సింగరేణి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.





