ప్రాంతీయం

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

5 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది,కన్విక్షన్ శాతం పెంచాలి :పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి,మంచిర్యాల జోన్లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు,లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, నేరస్తులకు శిక్ష పడేలా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు.దోషులకు శిక్ష పడే ప్రక్రియలో కోర్టు కానిస్టేబుళ్ల బాధ్యత ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. నేరస్తులకు సంబంధించిన వారెంట్లు,సమన్లు సత్వరమే అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
కోర్టు ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలియజేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచనలు, సలహాలను పాటించాలని ఆదేశించారు.కోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రయల్ కేసులు, వారెంట్లు,సమన్ల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేయాలని సూచించారు.
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటే పోలీసులపై ప్రజల నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. ఏదైనా నేరానికి పాల్పడిన వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారందరికీ తప్పనిసరిగా శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు.

టీఎస్‌కాప్ (TSCOP) అప్లికేషన్‌లోని సీసీడీ (CCD) మాడ్యూల్‌కు సంబంధించిన సమన్లు,వారెంట్ల నమోదు,జారీ ప్రక్రియ, సర్వీస్ వివరాల నమోదు,పెండింగ్ వారెంట్ల పర్యవేక్షణ, కోర్టు ప్రక్రియల నిర్వహణ అంశాలపై పోలీస్ సిబ్బందికి శిక్షణ అందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *