రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రవేట్ ఆసుపత్రుల పర్మిషన్ లేనటువంటి ప్రవేట్ హాస్పిటల్స్ రద్దు చేయాలని ప్రవేట్ హాస్పిటల్లో ఫీజులు నియంత్రించాలని కేపిపిఎస్ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన నుండి జిల్లాలో పుట్టగొడుగుల పుట్టుకస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏలాంటి డాక్టర్ లేకుండా సదుపాయాలు లేకుండా మాది మల్టీస్పెషల్ హాస్పిటల్ అన్ని మా హాస్పిటల్స్ లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని అనుభోగ్య డాక్టర్స్ ఉన్నారని వేల లక్ష రూపాయలు జ్వరం దగ్గు జలుబు లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్న పెద్ద పెద్ద టెస్టులు చేస్తూ ల్యాబ్ మరియు స్కానింగ్ పేరుతో ఎక్స్రేలా పేరుతో అమాయక ప్రజల నుండి పైసలు వసూలు చేస్తున్నారు.
సోమవారం పుట్టగొడుగుల ల్యాబ్ సెంటరు స్కాన్ సెంటర్లు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న డాక్టర్లు వారి వ్యక్తిగత ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని వారి హాస్పిటల్ కీ ఎక్కువ సమయాన్ని కేటాయించుకున్నారు.ప్రజలను వారి హాస్పిటల్స్ కీ మల్లిచ్చుకుంటున్నారు.వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం నరేష్ ప్రశాంత్ తగరులు ఉన్నారు.




