
నిఘా నీడలో ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు.
101 సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రతకు మరింత భరోసా.
నేరాల నియంత్రణలో,కేసుల చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.
ఒక సీసీ కెమెరాల 100 మంది పోలీసులతో సమానం.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్చందగా ముందుకు రావాలి: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
TS తెలుగు న్యూస్ 24/7: శనివారం రోజున ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమనికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ కెమెరాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…నేరాల నియంత్రణ,నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ఒక్క సీసీ కెమెరా100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాలను అరికట్టడంతో పాటు నేరాలకు పాల్పడిన నిందితులను త్వరితగతిన గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ ముందంజలో సాగుతోందని తెలిపారు.సీసీ కెమెరాలు, డిజిటల్ నిఘా వ్యవస్థలు,ఆధునిక దర్యాప్తు పద్ధతుల ద్వారా నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతోందన్నారు. ప్రజలు,వ్యాపారస్థులు,ప్రజాప్రతినిధులు స్వచ్చందగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని, తద్వారా పట్టణాల్లో,గ్రామాల్లో సంచరించే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించడం, నేరాలకు పాల్పడిన వ్యక్తులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు.ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంలో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయన్నారు.ముస్తాబద్ మండలం తో పాటుగా గ్రామాల్లో స్వచ్చందగా ముందుకు వచ్చి 101 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ధాతలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి,సి.ఐ నాగేశ్వరరావు,ఎస్.ఐ గణేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, సన్ రైస్ సీసీ కెమెరాల కంపెనీ సభ్యులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





