ముస్తాబాద్, ఏప్రిల్ 15 (24/7 ప్రతినిధి): వ్యాపారులు రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారంచేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై సిహెచ్ గణేష్ హెచ్చరించారు. ఎస్ఐ మాట్లాడుతూ ముస్తాబాద్ లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్న దుకాణదారులను హెచ్చరించారు. అంతేకాకుండా బస్టాండులో షాపులు, తోపుడుబండ్లు ఏవీ రోడ్డుకు అడ్డంగా ఉండరాదన్నారు. షాపుల ముందు ఉన్నకూలర్లు ఇతర వస్తువులు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయని పోలీస్ స్టేషన్ తరలించారు. ఇకపై ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తే ఈసారి ఉపేక్షించేది లేదన్నారు. కొందరు చిరు వ్యాపారులు, దుకాణదారులు

మాట్లాడుతూ మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి మా పిల్లలను ఎలా చదివించుకోవాలి రెక్కాడితే గాని డొక్కానిండని మా బతుకులతో పోలీసులు మమ్ములను భయభ్రాంతులకు గురిచేసి మా పరికరాలు గుంజుకపోయినారని చేసేదేంలేక నిస్సహాయకులుగా ఉండిపోయమన్నారు. గత ప్రభుత్వం మాపారులను ప్రోత్సహించిందే గాని ఇబ్బంది కలిగించలేదన్నారు. ఈ నడుస్తున్న ప్రభుత్వంపై పలు అంశాలపై విమర్శించి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతోపాటు ఏఎస్ఐ పోలీస్ సిబ్బంది ఉన్నారు.




