మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరసన.
జీవో నెంబర్ 252 ను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు జర్నలిస్ట్ సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు.
మంచిర్యాల జిల్లా.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జర్నలిస్టుల అక్రిడేషన్ జీవో నెంబర్ 252ను వ్యతిరేకిస్తూ శనివారం జర్నలిస్టులందరూ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. తర్వాత జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ జీవో నెంబర్ 252 వల్ల చాలామంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు దూరమవుతున్నాయని, ఇది జర్నలిస్టులో హక్కులను హరించి వేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జీవో నెంబర్ 252 ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అనంతరం జర్నలిస్టులు సంఘాల నాయకులు మరియు జర్నలిస్టులు కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మరియు జర్నలిస్టులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





