ప్రాంతీయం

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎల్తూరి శంకర్

16 Views

తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఎల్తూరి శంకర్

మంచిర్యాల, మే 28 : తెలంగాణ ఉద్యమకారుల వేదిక(టియూవీ) రాష్ట్ర కార్యదర్శిగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎల్తూరి శంకర్ ను నియమిస్తూ టియూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ లు నియామక పత్రం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజమైన ఉద్యమకారులకు అమలు చేసేంతవరకు పోరాటం చేయాలని వారు సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ఎల్తూరి శంకర్ మాట్లాడుతూ, నన్ను తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ వైస్ చైర్మన్ తోడేటి శంకర్ లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉద్యమకారులకు ప్రభుత్వమిచ్చిన హామీలను నిజమైన ఉద్యమకారులకు అమలు చేసేంతవరకు పోరాటం చేస్తానని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *