విద్య

TGEAPSET – 26 వెబ్ ఆప్షన్స్ పై సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు

22 Views

TGEAPCET – 2026 కౌన్సిలింగ్ మరియు వెబ్ ఆప్షన్స్ పై ఉచిత అవగాహనా సదస్సు.

TS తెలుగు న్యూస్ 24/7: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – రాజన్న సిరిసిల్లా జిల్లా వారి ఆధ్వర్యంలో TGEAPCET – 2026 ద్వారా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్స్ కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ ప్రక్రియ మరియు వెబ్ ఆప్షన్స్ పైన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అవగాహనా కల్పించడం కొరకు అవగాహనా సదస్సు తేది 2-6-2026 మంగళారం రోజున సాయంత్రం 4 గం లకు స్థానిక పాత పెట్రోల్ పంపు ఎదురుగా గల శ్రీ సత్యసాయి సేవా సమితి ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక JNTUH ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ Dr. T. Venugopal  పిల్లల మరియు తల్లిదండ్రుల యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి, వెబ్ ఆప్షన్స్, టాప్ కాలేజీ సెలక్షన్, ట్రేండింగ్ కోర్స్ ల గురించి అవగాహన కల్పించి సరయైన నిర్ణయం తీసుకొనే విధంగా తగు సలహాలు సూచనలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారని,ఈ సదస్సు లో పాల్గొనడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్నావారికే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ కొరకు 9849768828 లో సంప్రదించవచ్చు.ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ఉయోగించుకోవాలని శ్రీ సత్యసాయి సేవాసంస్థల జిల్లా అధ్యక్షులు తెంబరవేణి వినోద్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *