ప్రాంతీయం

ఎస్సైసొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు…

17 Views

ముస్తాబాద్, మే19 (24/7న్యూస్ ప్రతినిధి): భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగప డుతాయన్ని ఎస్ఐ సిహెచ్ గణేష్ పేర్కొన్నారు. ఎస్సై మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో నేరాలను నియంత్రించేందుకు, అసాంఘికకార్యకలాపాలు జరగకుండా ప్రశాంతమైన వాతవరణం కల్పించడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు. మండల కేంద్రంలోనే కాకుండా ప్రతీగ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజాపతినిధులు చొరవ చూపాలని వివరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డితో పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ మండలంలో రోడ్డుభద్రత నియమాలు, అపరిచితులపట్ల ఎలాజాగ్రత్తలు తీసుకోవాలి అనేఅంశాలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రజలకు అవగాహన చేస్తున్నందుకు ఎస్సై అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *