ముస్తాబాద్, మే18 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలో వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడక కొనసాగుతుండంతో రైతుల
అవస్థలు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులుకాదు నెలలు గడుస్తున్న ధాన్యం తూకం వేసేది లేదు లారీలు కదిలేదిలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేంలేక కొందరు రైతులు దళారులకు తక్కువ ధరకు తమధాన్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు ముందుకు సాగడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కస్తూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ చూసినా రైతులు కష్టపడుతూ వరి ధాన్యం కుప్పలవద్ద రాత్రింబవళ్లు రైతుకు కంటిమీద కునుకు లేకుండా పోతుందన్నారు. ఓవైపు వర్షాకాలం సమీపిస్తున్న సమయం దగ్గర్లోనే ఉన్నందున మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం మరింత వేగం పెంచాలని కోరారు.




