ముస్తాబాద్, మే17 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ మండల అధ్యక్షులు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించారు. క్రాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రైతులు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడగా ఓపక్క వేసిన వరి వేసినట్టే ఎండిపోయి మిగిలిన వరిధాన్యాన్ని కుప్పలుగాపో
సి పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే కుప్పల మీది కవర్లు ఎండలకు చితికిపోవడం ధాన్యం కుప్పలకింద సెదలు నెత్తి మీదున్న రోహిణి కాలంతో మొలకలు రైతులను నిండాముంచడం కనికరంలేని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు నత్తనడతన నడుస్తు ఉండం సిగ్గుచేటు అన్నారు. రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ రాజకీయానికి రైతులే తగినబుద్ధి చెప్తారని మండిపడ్డారు. ఈకార్యక్రమంలో మండల సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, మల్లారపు సంతోష్ రెడ్డి, ఎదునూరి గోపి, తిరుపతి, మీసా స్వామి, శక్తి కేంద్ర ఇంచార్జీలు మహేష్, స్వామి, వేణుగోపాల్, దిటి సత్తయ్య, చిగురు వెంకన్న, నక్కలరాజు, ఎల్లం, పున్నం అనిల్, భాను తదితరులు పాల్గొన్నారు.




