50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి.
మంచిర్యాల జిల్లా.
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో 50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటవద్దని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు జడ్జీలు నలుగురు ఐదుగురు కలిసి చేసిన నిర్ణయం మాత్రమే. భారత రాజ్యాంగం ఇప్పటివరకు 130 సార్లు సవరణలు చేసింది. ఇప్పుడు ఒక్కసారి బీసీల కోసం పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రిజర్వేషన్లు సవరణలు చేస్తే తప్పేముంది. మా బీసీ జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు అమలు చేయాలి. పార్లమెంటులో వెంటనే 50% సీలింగ్ రిజర్వేషన్లను ఎత్తివేసి బీసీలకు న్యాయం చేయాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, శాఖపూరి భీమ్సేన్, చంద్రగిరి చంద్రమౌళి అంకం సతీష్ మరియు చెలిమల అంజయ్య పాల్గొన్నారు.





