…….మర్కుక్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనే విషయాలను పిఎచ్సి డాక్టర్, మెడికల్ సిబ్బందిని అడిగారు. పిహెచ్సిలో తప్పనిసరిగా అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లు, పరీక్షా కిట్లు ఉంచుకోవాలన్నారు. కరోనా పరీక్షలు కూడా జరిపి కరోనా కిట్లు అందించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య మహిళ కేంద్రల పనితీరును డాక్టర్ మెడికల్ ఆఫిసర్ మరియు అక్కడి సిబ్బంది తో అడిగి తెలుసుకున్నారు. ప్రతి మంగళవారం మహిళలకు స్పష్టంగా పరీక్షలు మందులు అందించే గొప్ప కార్యక్రమం గురించి గ్రామపంచాయతీలో పోస్టర్ లు అతికించి ఎక్కువమంది మహిళలకు తెలియజేయాలి. ఏపీఎం లు మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి ఆరోగ్య మహిళ కేంద్రాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికీ మూడు వారాలకు గాను పిహెచ్సిలో 236 మంది మహిళలకు సేవలు అందించినందుకు గాను కలెక్టర్ అభినందించారు. వచ్చిన ప్రతి మహిళకు ఆరోగ్య మహిళ రికార్డు బుక్కును అందించి అందులో మహిళల పూర్తి వివరాలు చేర్చుతారు అనంతరం పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆరోగ్య విషయాలు అందులో పొందు పరుస్తారు. ఈ బుక్ చాలా ముఖ్యమైనది ఒకవేళ మెరుగైన వైద్యం కోసం దగ్గరలో గల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలి. ప్రతి ఒక్క విషయాన్ని ఆన్లైన్ సైట్ లో జాగ్రత్తగా పెట్టాలన్నారు. రికార్డులు క్షుణ్ణంగా చూసారు. వచ్చిన ప్రతి మహిళా పేషెంట్ కు క్వాలిటీతో కూడిన వైద్యం అందించినప్పుడే ఈ ఆరోగ్య మహిళా కేంద్రానికి మంచి గుర్తింపు లభిస్తుందని సిబ్బందితో అన్నారు. పి హెచ్ సి కి వచ్చిన పేషంట్లతో మాట్లాడారు ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా అని అడగగా బాగానే ఉన్నాయని తెలిపారు. మెడిసిన్ గది చూశారు అందులో ఆరోగ్య మహిళా కేంద్రం మందులను సపరేట్గా పెట్టాలని సూచించారు. పి హెచ్ సి ప్రాంతంలో యోగా సెంటర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మరియు ఆరోగ్య మహిళ కేంద్రంలో ప్రతి మహిళ ఈ సేవలు తెలిసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కి తెలియజేశారు అనంతరం గ్రామంలోని మహిళ సమైక్య భవనంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు రోజు సుమారుగా 120 నుండి 150 మంది వస్తున్నారని తెలిపారు. శిబిరంలోని వైద్య బృందాన్ని ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా టెస్ట్ చేసి ట్యాబ్ ఎంట్రీ చేసి అద్దాలను అందించాలన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలలో త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలియజేశారు. ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని ఉపయోగించు కునే విధంగా చర్యలు చేపట్టాలని సర్పంచ్ వార్డు సభ్యులకు వివిధ ప్రజాపతినిదులకు తెలియజేశారు
