
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ గడ్డం నగేష్
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సందర్శించారు.ధాన్యం సేకరణలో తరలింపు లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.వాహనాల కొరత తో ధాన్యం తరలింపు వేగవంతంగా జరుగడం లేదని ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.దీంతో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లలో ధాన్యం తరలించాలని సూచిస్తూ ట్రాక్టర్ యజమానులతో సైతం మాట్లాడారు.వీలైనంతగా ధాన్యం సేకరణ,తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.ఇక్కడ ఆర్ఐ శ్రావణ్ కుమార్,మాజీ ఎంపీటీసీ ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, రైతులు,సెంటర్ నిర్వాహకులు కలరు.





