
ప్లాస్టిక్ పై నిషేధం విధించిన బొప్పాపూర్ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో బుధవారం పాలకవర్గం సాధారణ సర్వసభ్య సమావేశం సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి అధ్యక్షతన నిర్వహించారు.ఇట్టి సమావేశంలో బొప్పాపూర్ గ్రామంలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని తీర్మానం చేశారు. గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమాల కు అయినా ప్లాస్టిక్ ప్లేట్లను,గ్లాసులను వాడకూడదని నిర్ణయించారు.గ్రామంలో జరిగే శుభ,అశుభ కార్యక్రమాలకు గ్రామ పంచాయతీ తరుపున రెండువేల స్టీల్ ప్లేట్లను,గ్లాసులను అందుబాటులో ఉంచామని.అందుకు నామమాత్రపు రుసుము వసూలు చేయాలనే ఆలోచన చేస్తున్నామని సర్పంచ్ ఇల్లేందుల గీతాంజలి- శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు. అందరికీ అవగాహన కల్పించాక రానున్న రోజుల్లో గ్రామంలోని ఫంక్షన్ హాల్ లలో ప్లాస్టిక్ వాడినట్లయితే అట్టి ఫంక్షన్ హాలుకు పదివేల రూపాయల జరిమానా విధిస్తామని,గ్రామంలో ఎవరైనా ప్లాస్టిక్ వాడినట్లయితే 5000 రూపాయల జరిమానా విధిస్తామని, దుకాణాలలో అమ్మినట్లయితే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.ఇట్టి సమావేశంలో ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి,కార్యదర్శి సంతోష్,వార్డు సభ్యులు పాల్గొన్నారు.ఇట్టి నిర్ణయం పట్ల గ్రామస్తులు, పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





