గజ సింగవరం స్టేజి వద్ద ఇరువురిని ఢీకొట్టిన స్కార్పియో వాహనం
స్కార్పియోను ఓవర్ టెక్ చేసిన ఎలక్ట్రికల్ బస్సు
అదుపుతప్పి ప్రయాణికులను ఢీకొట్టిన స్కార్పియో
TS తెలుగు న్యూస్ 24/7 రాజన్న సిరిసిల్ల జిల్లా గంబిరావుపేట మండలం గజ సింగవరం స్టేజి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులను స్కార్పియో వాహనం ఢీ కొట్టింది.కామారెడ్డి వైపు నుండి సిరిసిల్ల వైపునకు వస్తున్న స్కార్పియో వాహనాన్ని కుడి వైపు నుంచి ఓవర్ టెక్ చేసిన ఎలక్ట్రిక్ బస్సు గజ సింగవరం స్టేజి రావడంతో ఎడమ వైపు కు తిప్పి స్టేజి వద్ద నిలపడంతో అదే రూట్ లో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన బస్సు కోసం వేచి చూస్తున్న ఇద్దరు మహిళలను ఢీ కొట్టిందని ఓ మహిళ చేతిలో చిన్న బాలుడు ఉన్నాడని స్థానికులు తెలుపుతున్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






