Breaking News

కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపిఎస్.

87 Views

*కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపిఎస్.

*సైబర్ నేరాలపై మీకు తెలిసిన వారికి మీ బంధువులకు అవగాహన కల్పించాలి*

*అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు*

*సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది*

*మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం మహిళల భద్రత మా ముఖ్య బాధ్యత*

*ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ* ప్రతి ఒక్కరికి చట్టాల గురించి తెలిసి ఉండాలని బాలికల మహిళల రక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేయడం జరిగిందని తెలిపారు. మరియు మహిళలు బాలికలు కష్టపడి చదివి ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకుని చదవాలని సూచించారు సమాజంలో మగవారితో పోటీపడి ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. చక్కగా చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. కష్టపడి చదవాల్సిన వయస్సులో చెడు అలవాట్లకు బానిసలు కావద్దని సూచించారు, కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. మరియు షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ గురించి తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండి అయిన పిర్యాదు చేసేందుకు ఉపయోగపడే ఈ షీటీమ్ కంప్లైంట్ QR కోడ్ స్కానింగ్ పోస్టర్స్ ను జిల్లాలో RTC బస్ లలో, బస్ స్టాండ్ లలో, సినిమా హల్ లు, స్కూల్స్, కళాశాలలు,ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో అతికించబడి ఉంటాయని జిల్లా లో ఎవరైనా బాధిత మహిళలు షీ టీమ్ కు పిర్యాదు చేయదలుచుకున్నప్పుడు ముందుగానే తమ మొబైల్ నందు QR కోడ్ స్కానర్ ను@⁨+91 94411 30631⁩ కలిగి ఉండాలని తమ ఫోన్ తో పోస్టర్ పై ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా https://qr.tspolice. gov. in అనే లింక్ వస్తుంది దీనిని క్లిక్ చేయగానే పిర్యాదు ఫోరం ఓపెన్ అవుతుంది. అందులోని పేరు, లొకేషన్ తదితర వివరాలను పూరించి submit చేయగానే జిల్లా పోలీస్ కార్యాలయంలో షీటీమ్ సాఫ్టువేర్ ఐటీ విభాగానికి చేరుతుంది. అక్కడ నిరంతరం పర్యవేక్షించే ఐటీ సిబ్బంది ఎప్పటి కప్పుడు ఆన్లైన్ లో వచ్చే ఫిర్యాదులను స్వీకరించి ఆలొకేషన్ కు దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు ఫార్వర్డ్ చేయడం ద్వారా సంబంధిత అధికారులు లొకేషన్ కు చేరుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి వేధింపుల కైన గురయ్యే మహిళలు షీ టీమ్ కు పిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అంతే కాకుండా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్-100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.

ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా @⁨+91 94411 30631⁩ వెంబడించిన వెంటనే 100, 112, 1098, షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667343 మహిళా పోలీస్ స్టేషన్ నెంబర్ 8712667435 హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ 9440700906, 040-27852246 ఫోన్ చేసినచో మరియు (ఫేస్ బుక్, sdptsheteam,)(మెయిల్,sdptsheteam@gmail.com), (ట్విట్టర్, @sdptsheteam) పిర్యాదు చేసినచో, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ గారు తెలిపినారు.మరియు ఆ ప్రదేశానికి 5 నుంచి 10 నిమిషాలలో చేరుకుంటాం మరియు ఫోన్ చేసినవారి నెంబరు పేర్లు గోప్యంగా ఉంచుతామని విద్యార్థినిలకు మరియు మహిళలకు మరియు కళాశాల విద్య చాలా ముఖ్యమైనదని ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరి రక్షణ గురించి పోలీస్ కమీషనర్ గారి సూచన మేరకు షీటీమ్స్ పని చేయడం జరుగుతుందని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే వాట్సప్ నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని మరియు జిల్లాలో ప్రత్యేకంగా షీటీమ్ నడుస్తుంది .మీకు తెలియకుండా పోలీసులు సివిల్ డ్రస్ లలో ముఖ్య కూడలిల్లో తిరుగుతునారు

పట్టణములో కూడా ప్రతి కూడలిల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది. మీ యెక్క బంగారు భవిష్యత్తును నాశనము చేసుకునకూడదని చదువుకునే విద్యార్థినిలకు 18 సంవత్సరాలు నిండకుండానే వివాహము చేస్తున్నట్లుగానే తెలిస్తే వెంటనే 1098 కు తెలియజేయాలని, మరియు యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ యూనిట్ను సిద్దిపేట కమిషనరేట్ లో ప్రారంభించడం జరిగింది. మనుషులు అక్రమ రవాణా జరిగితే వెంటనే సమాచారం అందించాలని తరచుగా కిడ్నాప్ తదితర ఆర్గనైజ్డ్ నేరాలు చేసే వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. షీ టీమ్స్, యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ ఫిర్యాదు చేయడానికి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఉన్న వాల్ పోస్టర్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి, హుస్నాబాద్ ఏసిపి సతీష్, సీఐ కిరణ్, కోహెడ ఎస్ఐ తిరుపతి, అధ్యాపకులు, హుస్నాబాద్ షీ టీమ్ సిబ్బంది

ఎఎస్ఐ మల్లేశం, కానిస్టేబుల్ దుద్యా నాయక్, మహిళా కానిస్టేబుళ్లు రజిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *