మలేషియాలో గుండెపోటుతో గొల్లపల్లి వాసి మృతి
-మృతి చెందిన పొన్నాల వెంకటరెడ్డి,దిక్కులు పిక్కటిల్లెల రోదిస్తున్న భార్య వనజ
కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ కొండ రమేష్ గౌడ్,ఉప సర్పంచ్ పొన్నాల మణెమ్మ
మలేషియా నుండి మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని పొన్నం ప్రభాకర్,కేటీఆర్ లను కోరిన సర్పంచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకటరెడ్డి బ్రతుకుతెరువు నిమిత్తమై మలేషియా వెళ్లగా మంగళవారం ఉదయం వేకువజామున సుమారు 5 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.ఇట్టి విషయం తెలుసుకున్న సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యే కేటీఆర్ లకు విషయం తెలియజేసి మలేషియా నుండి మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.కాగా మృతుడికి భార్య వనజ,ఒక కూతురు ఉండగా కూతురుకు వివాహం జరిగింది.ఈ సంఘటనతో గొల్లపల్లిలో విషాద ఛాయలు కలుముకున్నాయి.






