బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, భారత రాష్ట్ర సమితి 25 వసంతాలు పూర్తిచేసుకుని 26 వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో తెలంగాణ తల్లి ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారత రాష్ట్ర సమితి జెండాను ఆవిష్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ టీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్ , మాజీ ఉపసర్పంచ్ నర్సంపల్లీ బాబు గౌడ్ , 5 వ వార్డు సభ్యులు బాలెంకు శ్రీను , ప్రధాన కార్యదర్శి యు.నర్సింగ్ ,సీనియర్ నాయకులు గడిల శ్రీకాంత్ , లక్ష్మణ్, యూత్ లీడర్ అశోక్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





