Breaking News

ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’

107 Views

ఏప్రిల్ 10, 24/7 తెలుగు న్యూస్ :‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ : మోడిపై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు

హైదరాబాద్‌ : సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రధాని నరేంద్ర మోడిపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ మోడికి చురకలు అంటించారు. కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, కర్నాటక ప్రభుత్వం నేరుగా సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్రం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ నేను జంగమను. జంగమను ప్రజలు అందరూ తాను చెప్పినట్లు వినాలని ‘ కొందరు నేతలు యోచిస్తుంటారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు కరవు పరిహారాన్ని విడుదల చేయాలని గత ఏడాది సెప్టెంబరు నుంచి కోరుతూ వస్తున్నా స్పందించకుండా, ఇప్పుడు కర్నాటక నుంచి విన్నపమే రాలేదంటూ చెప్పడం దారుణమని వ్యాఖ్యలు చేశారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal