ఆగస్టు ఆలేరు యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో శనివారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆలేరు మండలం ఆధ్వర్యంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి 38వ వర్ధంతి సభ పున్నబోయిన రవి అధ్యక్షతన జరిగింది సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం భూమి కొరకు భుక్తి కొరకు దున్నవానికే భూమి కావాలని ఎట్టి చాకిరి రద్దు కావాలని అనేక పోరాటాలు నడిపిన చరిత్ర ఆరుట్ల దంపతులకు ఉంది అని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్యాగాలను గుర్తించి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టాలని సిపిఐ పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు
కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ సర్పంచి ఆరుట్ల లచ్చన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ గంధమల అశోకు మామిడాల సోమయ్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొల్లు రాజయ్య పోతు ప్రవీణ్ తుంగకుమారు రాజు మల్లేశం తేడు ఆంజనేయులు మాటూరు జానమ్మ పోతు బాలయ్య బుజ్జో సోమలింగం సరళ అందాలు పూలమ్మ నాగమణి బాలమణి తదితరులు పాల్గొన్నారు





