రాజకీయం

నూతనంగా నియామకమైన నాయకులను అభినందించిన కేకే మహేందర్ రెడ్డి

76 Views

నూతనంగా నియమితమైన వారికి అభినందనలు తెలిపిన కేకే మహేందర్ రెడ్డి.

-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ముష్కం దత్తాద్రి గౌడ్,ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియామకమైన ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముష్కం దత్తాద్రి గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమాకమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి లను సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సోమవారం శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ షేక్ సభేరాబేగం,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి,పర్ష హనుమండ్లు,మెండే శ్రీనివాస్ యాదవ్, గుర్రాల రాజిరెడ్డి,తదితరులు పాల్గొని వారిని అభినందించారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *