( మానకొండూరు డిసెంబర్ 23)
మానకొండూర్ నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన క్రిస్టియన్ సోదర సోదరీమణులకు కానుకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..
ఏసుప్రభు నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదే విధంగా ఇతరులను ప్రేమించమని, ఏసుప్రభు బోధించాడని, కోపాలు, ద్వేషాలు, అసూయ త్యజించాలని కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని ఇతరులను గౌరవించాలని బైబిల్ లో ఉందని అన్నారు..
క్రిస్టియన్ సోదర సోదరీమణులు ప్రజలు సామరస్య భావంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని వీలైనంత మేరకు ఇతరులకు సహాయం చేయాలని పిలుపునిచ్చాడు…




