ఆధ్యాత్మికం

ప్రముఖుల ఆధ్వర్యంలో రామకోటి రామరాజుకు ఘన సన్మానం

83 Views

– రాముని కోసమే జీవితం అంకితం చేసిన గొప్ప
రామభక్తుడు

గజ్వేల్ , జులై 30

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు ఇటీవల భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా మంగళవారం నాడు వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేషి అభినందనలు తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ రామనామమే ఊపిరిగా రామకోటి నామాన్ని లిఖింపజేస్తూ ప్రజలను భక్తిమార్గం వైపు మల్లె విధంగా కృషి చేస్తున్న రామకోటి రామరాజుకు భక్తిరత్న జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వకారణం అన్నారు. 25సంవత్సరాల నుండి రాముని సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రామభక్తుడు అన్నారు.

ఈ కార్యక్రమంలో కిరాణ వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం గౌడ్, దొంతుల సత్యనారాయణ, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ, ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ కొమురవెల్లి సంపత్, నాయకులు నంగునూరి విజయ్, చకిలం సంపత్, కైలాస ప్రశాంత్, ఉమేష్, సిద్దేశ్వర్, భూపతి తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్