రాజకీయం

ముస్లింలకు కేసిఆర్ రంజాన్‌ శుభాకాంక్షలు

91 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 11

పవిత్ర రంజాన్‌ మాసం చివరిరోజు ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పర్వదినం సందర్భంగా ముస్లింలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

నెలరోజులపాటు కొనసాగిన రంజాన్‌ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయని పేర్కొన్నారు.

అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ర్టాన్ని సర్వమతాల సమాహారంగా, గంగాజమునా తెహజీబ్‌కు ఆలవాలంగా మార్చామని, లౌకికవాద సంప్రదాయాలను పాటిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తమ పదేండ్ల పాలనలో నిలబెట్టామని తెలిపారు. అదే సంప్రదాయం కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని దైవాన్ని ప్రార్థించారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్