నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన కొన్న రవాణా చేసిన కఠిన చర్యలు, డీసీపీ ఏ.భాస్కర్, ఏసీపీ కిరణ్ ల హెచ్చరిక
మంచిర్యాల జిల్లా ,బెల్లంపల్లి.
నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన, కొనిన,రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి కిరణ్ హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని శ్రేయస్ బంక్వట్ హాల్ నందు వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ,రెవిన్యూ శాఖ, లైసెన్స్ కలిగిన విత్తన డీలర్స్ కు అనదికార, నకిలీ విత్తనాల నివారణ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో బెల్లంపల్లి వ్యవసాయ అధికారి సుద్దాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ,నాణ్యమైన విత్తనాన్ని, నకిలీ విత్తనాన్ని ఎలా గుర్తించలో, నకిలీ విత్తనాలు అమ్మితే ఎలాంటి చట్టపరమైన శిక్షలు పడతాయో వివరించారు. బెల్లంపల్లి అగ్రికల్చర్ ఏడి రాజానరేందర్ మాట్లాడుతూ, లైసెన్స్ పొందిన డీలర్స్ ఎవరుకూడా నకిలీ విత్తన దందాలో ప్రత్యేక్షంగా గాని, పరోక్షంగా గాని భాగస్వాములు కావొద్దని, ఎవరైనా భాగస్వాములు అయితే లైసెన్స్ రద్దుచేసి క్రిమినల్ కేసులు పెడతామని చెచ్చరించారు. చెన్నూర్ ఏడిఏ బానోత్ ప్రసాద్ మట్కాడుతూ, గడ్డి నివారణకు గలైఫోసేట్ మందు వాడుతున్నారని, అది క్యాన్సర్ కారకమని, రైతులు సులువుగా కలుపు నివారణ కు అలవాటు పడి, నేల ఆరోగ్యం పాడుచేస్తూ,రైతు ఆరోగ్యం పాడు చేసుకుంటూ, పర్యావరణానీకి హాని చేస్తున్నారని, గ్లాయ్ఫోసెట్, పారాక్వాట్ మందులను రైతులు వాడొద్దని కోరారు. ఏసీపీ కిరణ్ మాట్లాడుతూ, నకిలీ, గ్లైసీల్ పత్తి విత్తనాల కట్టడి లో లైసెన్స్ పొంది ఉన్న విత్తన డీలర్స్ పాత్ర కూడా కీలకం అని, వ్యవసాయాధికారులు, రెవెన్యూ సిబ్బంది,పోలీస్ సిబ్బంది కలిసికట్టుగా నిఘా పెట్టి నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలిపారు, అదీకృత డీలర్స్ కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ,అనుమతి లేని పత్తి విత్తనాలు అమ్మినా, కొన్నా,రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, గ్రామాలల్లో కార్డ్ ఆన్ సర్చ్ చేసి విత్తన నిలువలను పట్టుకుంటామని, నకిలీ విత్తన దందా చేసే వారిని ఉపేక్షించమని, నకిలీ విత్తన దందా చేసేవారి వివరాలు అందించాలని కోరాను. అనుమతి లేని గ్లీసీల్ విత్తనాలు అమ్మడమే కాదు, కొనడం కూడా నేరమే అవుతుందని, అనవసరంగా రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గం లోని ఏ ఓ లు, ఏ ఈ ఓ లు, విత్తన డీలర్స్, మందమర్రి ఏ డి ఏ, ఏ ఓ,ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.





