*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*ఎలాంటి ప్రతికూల పరిస్థితులలోనైనా ప్రజారక్షణే మా ధ్యేయం. – శ్రీ యం. శ్రీనివాస్, ఐపియస్.,*
*భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం : మంచిర్యాల కలెక్టర్ సంతోష్*
*భవిష్యత్తు ముందస్తు అప్రమత్త లో బాగంగా డెమో కార్యక్రమం*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ పరిధిలో వర్షాకాలంలో కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంతాలలో, వరదలలో చిక్కుకున్న ప్రజలను రక్షించడం కొరకు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ మరియు స్పెషల్ పార్టీ నుండి 20 మంది కానిస్టేబుల్ మొత్తం 44 మందికి హైదరాబాద్ నాగోల్ లోని ఎన్ డి ఆర్ ఎఫ్ శిక్షణ కేంద్రంలో వారం రోజులపాటు శిక్షణ ఇప్పించి సుశిక్షితులైన ఫ్లడ్ రెస్క్యూ టీం ఏర్పాటు చేయడం జరిగింది.
దానిలో భాగంగా ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫ్లడ్ రెస్క్యూ టీం ముందస్తు అప్రమత్తతలో భాగంగా ప్రమాదంలో ఉన్న వారిని ఏ విధంగా రక్షించాలని ఒక డెమో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల కలెక్టర్ శ్రీ బి సంతోష్, మంచిర్యాల డిసిపి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ హాజరై ఫ్లడ్ రెస్క్యూ టీం సభ్యుల ప్రదర్శనని వీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా రామగుండం సిపి మాట్లాడుతూ.. రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని, మంచిర్యాల జోన్ పరిధిలో గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలం లో కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి అయి, ఆస్తి నష్టం మరియు పశువులకు ప్రాణ నష్టం జరుగుచున్నది. మనుషులు వరదలలో చిక్కుకుని ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇట్టి ఇబ్బందులను అధిగమించుటకు గాను మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ బి. సంతోష్ గారి అధ్వర్యంలో ఫ్లడ్ రెస్క్యూ టీం కు కావలసిన వస్తువులు కొనుగోలు చేయడం జరిగినది. ఇట్టి నిధులతో 1) 10 seater boat with 5HP motor, 2) Lifebuoys -10, 3) Sea master life jackets 50, 4) Medical stretchers -5 మరియు 5) Wood cutter-4 పరికరాలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రజల ధన, ప్రాణ రక్షణ మా ధ్యేయమని, మంచిర్యాల జిల్లా పరిధిలో, సుశిక్షితులైన 44 సభ్యులతో ఫ్లడ్ రెస్క్యూ టీం తయారు చేయడం జరిగిందని, ఈ టీం యొక్క సభ్యులు ఈ చుట్టుపక్కల ఎక్కడ వరద సమస్యలు వచ్చిన అందుబాటులో ఉండి ప్రజల యొక్క ఆస్తి, ప్రాణ రక్షణలో పాలు పంచుకోగలరని తెలపడం జరిగింది.
కలెక్టర్ మాట్లాడుతూ .. వర్షాకాలం ప్రారంభం కాబోతుంది కావున గత సంవత్సరంలో మంచిర్యాల జోన్ పరిధిలో లోతట్టు ప్రాంతాలలో జరిగిన సంఘటనలను పునరావృతం కాకుండా వరదల సమయంలో ప్రజలకు ఎవరు కూడా ఏలాంటి ఆపద జరగకుండా తక్షణమే వారిని కాపాడాలని ఉద్దేశంతో రామగుండం సిపి, మంచిర్యాల డిసిపి , కలెక్టర్ తో కలిసి ఒక టీం లా ఏర్పడి స్లడ్ ఎక్విమెంట్స్ ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. శిక్షణ పొందినటువంటి టీం సభ్యులు భవిష్యత్తులో ఎవరైనా వరదలో చిక్కుకున్న, వరద నీరు ఉన్న ప్రాంతంలో చిక్కుకుపోయిన ఎక్కడైనా రాకపోకలు ఇబ్బంది కలిగే విధంగా చెట్లు పడిపోయిన వాటిని తొలగించడం కోసం శిక్షణ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జోన్ పరిధిలో ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఇట్టి టీం వెంటనే అప్రమత్తమై ఎలాంటి ప్రాణనష్టం, ఎవరికి ఆపద కలగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో జరిగిన విధంగా ఎలాంటి సంఘటనలు జరిగిన అన్ని రకాల ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్ ఐపిఎస్ , గోదావరిఖని ఏసిపి రమేష్ మంచిర్యాల ఏ సి పి ఆర్ ప్రకాష్ ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, మంచిరాల రూరల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ రామగుండం సిఐ అజయ్ బాబు, ఆర్ ఐ కు శ్రీనివాస్, వామనమూర్తి, దామోదర్, రామగుండం ఎస్ఐ సతీష్ హాజీపూర్ ఎస్సై సురేష్, NDRF టీమ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





