ప్రాంతీయం

నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

11 Views

మంచిర్యాల జిల్లా

నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 22, 2026:
భూమి అభివృద్ధిలో భాగంగా వెంచర్ల ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.  బుధవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో వెంచర్ ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులకు సంబంధించి భూమిని పట్టణ ప్రణాళిక అధికారి సంపత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వెంచర్ల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *