
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తాం: సర్పంచ్ భూక్యా రజిత సంతోష్
TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం జై సేవాలాల్ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ భూక్యా రజిత సంతోష్ మాట్లాడుతూ తండా లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి మా పాలక వర్గం కృషి చేస్తుందని గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలనీ సూచించారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్,అంగన్వాడీ టీచర్ కళ్యాణి,ఉపసర్పంచ్ శ్రీనివాస్,పాలక వర్గ సభ్యులు, పాఠశాల కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు పుర ప్రముఖులు పాల్గొన్నారు.





