ప్రాంతీయం

ఆర్టీసీ సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు….ప్రజా రక్షణ, శాంతి భద్రతకే ప్రాధాన్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

9 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

*ఆర్టీసీ సమ్మె సమయంలో హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు….ప్రజా రక్షణ, శాంతి భద్రతకే ప్రాధాన్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*

*ఉద్యోగం కోసం వచ్చే డ్రైవర్లు, కండక్టర్లకు పూర్తి భద్రత*

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

📌సమ్మె సమయంలో విధుల్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు, అలాగే బస్సుల యజమానులను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ఇళ్లపై దౌర్జన్యాలకు దిగడం వంటి ఘటనలను పోలీసులు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి చర్యలు చట్ట విరుద్ధమని, పాల్గొన్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించబడతారని హెచ్చరించారు.

📌ప్రజలు ఎవరూ భయపడకుండా తమ విధులు నిర్వర్తించాలనీ, ఉద్యోగం కోసం వచ్చే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. ఎవరైనా బెదిరింపులు, దాడులకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

అత్యవసర సహాయం కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్: 87126 56597, డయల్ 100 కాల్ చేయండి అని తెలిపారు. పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నారని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని కమిషనర్ తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *