ముస్తాబాద్ ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే ‘అరైవ్-ఆలైవ్’ అని ముస్తాబాద్ ఎస్ఐ సిహెచ్. గణేష్ శనివారం రోజున రోడ్డు
ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా నామాపూర్ గూడెం గ్రామాల మధ్యనున్న మూల మలుపులవద్ద ఉన్న చెట్లకు సిగ్నల్ ఏర్పడాలని రెడ్ రేడియం స్టిక్కర్లను అతికించారు. ఎస్ఐ సిహెచ్ గణేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని లైసెన్స్, వాహన పత్రాలు లేకుండా వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు చోటుచేసుకుంటాయని అవగాహన కొరకు తన సిబ్బందితో కలిసి స్టిక్కర్లు అతికించామని తెలిపారు.




