ముస్తాబాద్, ఏప్రిల్ 19 (24/7న్యూస్ ప్రతినిధి): ప్రధాన రహదారులపై తరచుగా నల్లాల పైపులైన్ లీకేజీ సమస్య తీవ్రంగా ఉంది, దీనివల్ల ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతుగల్ సిద్దిపేట కామారెడ్డి వెళ్లే ప్రధాన మార్గంలో పైపులైన్ తరచూ లీకేజ కావడం మళ్ళీమళ్ళీ రిపేరు చేయడం రాజుల పైసల రాళ్లపాలు అన్నట్లుగా ప్రభుత్వ ఖజానా గండికొట్టడం చరమామూలు అయిపోయిందని బాటసారులు అంటున్నారు.

ప్రమాదానికి నిలయంగా గోయిల కారణంగా బస్సులు లారీలు ఇతర ప్రయాణికులకు ప్రయాణం నరకయాతనగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిద్రాహారాలుమాని ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ సూచనలు చేస్తున్నప్పటికీ మండల అధికారులకు ఎలాంటి చలనం లేదంటున్నారు. ఈ రహదారిపై జెసిబి సహాయంతో భారీగుంతలుకాదు భారీగోయిలు తీస్తారు వారాల

తరబడి మరమ్మతులు చేస్తారు. అసలు ఈ లీకేజీ ఎందుకు అవుతుంది ఇలా కాకుండా పైపులైన్లు పగలకుండా విధులు నిర్వహించే వాళ్ళలోపమా సున్నితంగా నిర్వహించరాదా అని స్థానికులు ప్రజలు మండిపడుతున్నారు. ప్రమాదం పొంచి ఉన్నదని తెలిసి కూడా హెచ్చరిక బోర్డులు ఓవైపునపెట్టి మరోవైపు ప్రపంచానికి ఆధునిక భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, మరియు న్యాయవాది. అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం రాజ్యాంగబద్ధమైన సమానత్వం కల్పించిన మహానాయకుడు. భారతరత్న గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్, సమసమాజ స్థాపనకోసం జీవితాన్ని త్యాగంచేశారు. రాజ్యాంగాన్ని రచించిన ఆ మహనీయుని జెండాను సమ సమాజం తలదించుకునేలా రోడ్డుపైన గుంతకు ఫ్లెక్సీని అడ్డుగా కాదు అడ్డంగా పెట్టారు ఎంతవరకు సమంజసమని ప్రజలు మండిపడుతున్నారు.




