ప్రాంతీయం

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు.

27 Views

 

సిద్దిపేట, 13 ఏప్రిల్, తెలుగు న్యూస్ 24/7

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులతో ఎసిఎల్బి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, ఆసరా పింఛన్ల మరియు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన 235 అర్జిలను ఆయన స్వీకరించారు. అర్జిదారులకు న్యాయం చేసి తిరిగి అర్జి పెట్టుకోకుండా సకాలంలో సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్ కుమార్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *