ప్రాంతీయం

*రాంసాగర్‌లో భక్తి పారవశ్యం. ఘనంగా రాములోరి రథ ఊరేగింపు.

41 Views

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో శ్రీ సీతారాముల రథోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం నుంచి ప్రారంభమైన రథోత్సవ ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, యువకులు, చిన్నారులు ఆటపాటలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సాహంగా రథాన్ని లాగుతూ ఊరేగింపును విజయవంతం చేశారు. గ్రామ వీధులన్నీ భక్తి వాతావరణంతో కళకళలాడాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు శ్రీ సీతారాముల ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. ప్రతి ఏడాది జరిగే ఈ రథోత్సవం గ్రామ ప్రజల్లో ఐక్యతను, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తోందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ భక్త బృందం, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *