Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

102 Views

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

  • . రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సబేరా బేగం తో కలిసి ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకి ముందుగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని అన్నారు మే నెలలో ఇందిరమ్మ ఇండ్ల కు స్థలం లేని వారికి స్థలం సమకూర్చి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే ఆలోచనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందన్నారు ప్రభుత్వం సమకూరుస్తున్న 5 లక్షల రూపాయలతో పాటు ఇందిరమ్మ లబ్ధిదారులు మరికొంత వెచ్చించి వారికి నచ్చిన విధంగా శాశ్వత గృహాలను కట్టుకోవడం ఆనందాన్ని ఇస్తుందని అన్నారు ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల కోసం ఎంతవరకైనా డబ్బులు సమకూర్చి ఆదుకుంటామని అన్నారు మండలంలో రెండు కోట్ల రూపాయల అంతర్గత రహదారుల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ఆరు గ్యారెంటీలను అమలుపరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని అన్నారు పార్టీలకతీతంగా ఏ పార్టీకి చెందిన సర్పంచ్ లు ఉన్న గ్రామ అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తామని అన్నారు తను వెళ్ళిన గ్రామాలలో ఇతర పార్టీల నాయకులు కూడా నిధుల కోసం అడుగుతున్నారని తన. శక్తి మేరకు నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంతమంది ఇతర పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలని ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దామని ప్రస్తుతం అభివృద్ధి పైన అందరం దృష్టి పెట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేకే మహేందర్ రెడ్డి నూతన వస్త్రాలను అందించారు అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ తో కలిసి ఐదుగురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారుఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మణెమ్మ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి నాయకులు షేక్ గౌస్ బుగ్గ కృష్ణమూర్తి మర్రి శ్రీనివాసరెడ్డి గోగురి శ్రీనివాసరెడ్డి గుడ్ల శ్రీనివాస్ గుర్రాల రాజిరెడ్డి సాహెబ్ లక్ష్మణ్ బండారి బాల్ రెడ్డి. రాజిరెడ్డి బాబన్న తదితరు పాల్గొన్నారు
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *