నేడు కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టులో తీర్పు!
హైదరాబాద్:ఏప్రిల్ 08, తెలుగు న్యూస్ 24/7
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్,కమిషన్ నివేదికను సవాలు చేస్తూ.. మాజీ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు,స్మిత సబర్వాల్, పిటిషన్లు దాఖలు చేశారు.దాఖలు చేసిన పిటిషన్ లో అన్ని పక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు కొద్ది రోజులు తీర్పును రిజర్వు చేసింది._కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ రేవంత్ రెడ్డి,ప్రభుత్వం నియమించి న జస్టిస్ సిపి ఘోష్,కమిషన్ నివేదిక అంశంపై ఈరోజు హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.లిఖిత పూర్వక వాదనలు సమర్పించడానికి ఒకటి, రెండు రోజులు అవకాశం కూడా ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించ నున్న నేపథ్యంలో రాజకీ యవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది..





